Tuesday, February 2, 2010

joba

ఎవ్వరు అయినా మాల్డివేస్ దేశము లో జాబ్స్ కోసము వెతుకుతున్నారా? email me kpradeep4@gmail.com

Thursday, October 11, 2007

dream girl ఈల ఉండలి...!

కలువ పూల లాంటి కళ్లు...సంపెంగ మొగ్గ లాంటి ముక్కు...బూరెల్లాంటి నున్నని బుగ్గలు...మచ్చలేని చందమామ లాంటి మోము...ఉదయించే భానుడిలా నుదిటిపై ఎర్రటి తిలకము...కోడెనాగులా బుసకొట్టే వయ్యారి జడ...బంగారానికే వన్నె తెచ్చే మేని రంగూ...తామర తూడుల్లాంటి సుకుమారమైన చేతివేళ్లూ...తలకుమించిన భారము మోసే సన్నటి నడుమూ..పూలకన్నా మెత్తగా ఈ భూమాతను ముద్దిడే పాదాలూ...అన్నీ కలిసిన కలహంస నడకల కలికిచిలక ఈ చక్కని చుక్క...నకు dream girl కవాలి....!

భావ-సంచయము!!!

నా మనస్సు కళశంలోని నవరసములను
ఆలోచనా మందరముతో మధించి తీసితిని
భావపీయూషమును
స్మృతి స్మృతికి సమన్వయము అన్వయించి తీసితిని
భావ సంకలనమును..
మదిలోని పొంగి పొరలే కవితోద్రేకవారసిని మనోనేత్రముతో
గాలించి తీసితిని భావసంచయము

కానీ...!
భయము భయము
నా ఈ చిన్నారి విరిసీ విరియని
మదిలో అట్టి భావోద్రేకోదయం
ఎవరూ హర్షించరని
అందుకే ఈ ముగింపు

ఉపశమనం...!

చిన్నారి బోసి నవ్వుల నిష్కల్మష బాపూజి నవ్వును చూడుము
శాంతి కపోతాలనెగరవేసే నెహ్రూజీ మౌనశాంతి సందేశాలను
హృదయ కర్ణములతో వినుము
ప్రేమా మమతల ప్రతీక అయిన మథర్ థెరీసా మానవత్వమును
మనోనేత్రముతో కనుము
కరుణరసముతో కూడిన కరుణశ్రీ ఆవేధనాగీతములను
అచంచల మనస్సుతో పటించుము

ఎమిటి నీ హృదయ స్పందన...?!

చెప్పనా..!!!
ఈ మానవత్వ రాహిత్య సమాజములో
అలసి సొలసిన నీ మనస్సుకు
ఇంచుక ఉపసమనం...!

ప్రాణం!

ఓ సఖీ...!
కవితకు బావం ప్రాణం
పధ్యానికి చంధస్సు ప్రాణం
పాటకి పల్లవి ప్రాణం
సంగీతానికి సప్తస్వరములు ప్రాణం
నాట్యానికి తాళం ప్రాణం
శిల్ఫానికి బంగిమ ప్రాణం
మనిషికి మనస్సు ప్రాణం
మనస్సుకి మానవత్వం ప్రాణం

కానీ..!
నా మనస్సుకి నీవే ప్రాణం...!

సంశయించితిని!

ఓ సఖీ...!
నీ చిత్రము గీద్దామని రంగులు కలపబోయాను
కానీ..! సంశయించితిని
నీ అంత అందముగా రాదేమోనని

నిను వర్ణిద్దామని పదములు వెదకబోయాను
కానీ..! సంశయించితిని
నా వర్ణములు సరిపోలవేమోనని

నీ ప్రతిమను చెక్కుదామనుకున్నాను
కానీ..! సంశయించితిని
దానిని సజీవముగా తీర్చిదిద్దలేనేమోనని

ఏమి చెయ్యను.. ?!?!

బంధీ...!

ఓ సఖీ...!
ఆకాశాన హిమకరుడు నవ్వుతున్నాడు
కానీ..! ఆ చిరుధరహాసమును ఆస్వాదించలేకున్నాను ఎందుకో..?!

శీతల పవనుడు మృదువుగా స్పర్శిస్తున్నాడు
కానీ..! ఆ స్పర్శను ఆస్వాదించలేకున్నాను ఎందుకో..?!

ఎచటినుండో వినవస్తున్నది కోయల గానము
కానీ..! ఆ గానమాధుర్యమును ఆస్వాదించలేకున్నాను ఎందుకో..?!

ఓ..! తిలిసిందిలే..!
హిమకరుడి దరహాసమును,
శితల పవనుడి స్పర్శను,
కోయల గాన మాధుర్యమును
ఆస్వాదించేందుకు మనస్సుండాలిగా..!

కానీ..! నాకది కరువాయె
ఎమిటి..?! ఆశ్చర్యపోతుంటివా!?
నీకు తెలుసుగా నా మనస్సు నీ ఆధీనమని