Thursday, October 11, 2007

పదముల ప్రాసదేముంది Anu..

పదముల ప్రాసదేముంది Anu..
ఇచ్చిన పదములు పేర్చి.. ఎద తలుపులు తెరచి తలపులన్నింటా తానై నిండిన నా సఖిని చూస్తే.. నా మనస్సు మధువనిలో మక్కువగా తరగని వలపులు విరబూయించి వరించవా ఈ పదములు నవవసంతములై ఏమి తెలుసును నీకేమి తెలుసును ? నా ప్రియనెచ్చెలి కనుదోయిల మిరిమిట్లుగొల్పు కాంతులకంతుపట్టక రవికిరణుడు నిరంతరాన్వేషకుడై ప్రజ్వరిల్లుతున్నాడు నా ప్రియనెచ్చెలి చెక్కిలి ముద్దాడగ నింగిన నీలిమేఘాల దోబూచులాడు చంద్రకాంతుడు చుక్కలన్ని లేని రేయికోసం ఎదురుచూస్తున్నాడు నా ప్రియనెచ్చెలి పదస్పర్శ తెలిసిన దారిలో గడ్డిపూలు, అవి కందునేమోనని మెత్తటి తివాచీలు పరువ ముసురుకున్న మంచును సైతం లెక్కచేయకున్నవి ఏమి తెలుసును నీకేమి తెలుసును.. నా ప్రియనెచ్చెలి సొగసులకు మొత్తం ఈ ప్రకృతే పరువశించగా.. ఈ పదములేపాటివి.. ఒదగవా ఓ/ఈ ప్రబందమై

No comments: