Thursday, October 11, 2007

ప్రేమంటే..?

ప్రేమంటే..?నూనూగు మీసాల యవ్వన దశలోకన్నె అందాలెన్నో.. కనులముందు కవ్విస్తుంటే..వయ్యారుల వింతపోకడలను ఎంత వద్దనుకున్నా..ఓర చూపుల గమనిస్తుంటే.. గడిచిపోయిన గడియలెన్నో..తెలియక గుండె గుబిల్లుమంటే..ప్రేమంటే ఎమిటి..? అసలీ అంతరంగపు ఆంతర్యములర్థములేమిటి ?పసితనములో .. నేను మారం చేస్తుంటే..ముద్దు ముద్దుగా గోరుముద్దలు తినిపించిన..నా కన్న తల్లి ప్రేమలో కమ్మదనం తెలుసు..చేసిన అల్లరికి ఒక్క అరుపున గదమాయించి అంతలోనే..బిక్కముఖమును చూసి నన్ను ఒడిలోకి తీసుకునిబుజ్జగించిన తండ్రి ప్రేమలో ఆర్థి తెలుసు..మరి ఇదేమిటి ప్రేమంటే ఇంకేదో అంటున్నారుఅసలు ప్రేమంటే ఎమిటి..? అనే ప్రశ్న పదే పదే నన్ను తొలుస్తున్న తరుణములో..పుడమిని తాకే తొలకరి జల్లల్లే...పచ్చని పైరును పలకరించే పిల్లగాలల్లే..నీవు నా జీవితములోకి అడుగుపెట్టిన వేళఇంకా నా కనుల కలలా కదలాడుతూనే వుందిమన పొడి పొడి పరిచయములు త్వరగానే..సన్నిహిత సహచర్యములు సంతరించుకున్నవిగడిచిన ప్రతీ దినమూ నన్ను నీ తలపుల మరింత దగ్గరచేసినది.. మరి నిన్ను.. ?ఒడిలో రెపరెపలాడుతున్న పుస్తకమూ..శూన్యములోకి సుదీర్ఘముగ చూస్తున్న నా చుపులూ...ఎపుడూ హాస్య ఛలోక్తుల తృళ్ళిపడే నాలో,పెదవులపై అసంధర్బపు చిరు నగవులూ.. అంతలోనే అలుముకునే ముభావములు..అర్థం కాక ఇంట్లో నన్ను నిలదీస్తుంటే...ఎమని చెప్పను.. నాకే అంతుతెలియనిఈ తలపులనెవ్వరకి తెలుపను.. ?ఇది.. నీపై క్షణికాకర్షణా.. ?నిన్ను స్వంతం చేసుకోవాలన్న స్వార్థ చింతనా.. ?ఎమిటిది.. ? ఇదేనా ప్రేమంటే.. ?ఎవరినడగాలి..? నా ప్రియబాంధవి.. నీవేగా.. ? మరి నిన్ను అడగనా.. అనే సంకోచముతో..నిరంతరం నాలోనేనే సతమతమౌతుంటే.. నీదారిన నీవు నన్ను వీడి వెళ్ళిపోతుంటే..నివ్వెరపోయి.. నీవు లేని రేపు నేను లేనంటున్ననా మనసుని నిర్దయగా నొక్కివేసి.. పంటి బిగువన పెదవులచెక్కు చెదరని చిరునవ్వుల నీకు వీడ్కోలు పలికిననాలో.. కలిగిన ఆవేదన.. ఇప్పటకీ నన్నునిరంతరం కర్కశంగా కలిచివేస్తూనే వుంది..నిలువెత్తు నీడలా నన్ను నిలదీస్తూనే వుంది..ప్రేమంటే ఇదేనా.. ? నేను ప్రేమిస్తున్నానా.. ?

No comments: