Monday, October 8, 2007

నిర్జీవమైన అందాన్ని

నిర్జీవమైన అందాన్ని... అనివార్యమైన మరణాన్ని
అంతులేని కాలాన్ని... గమ్యం లేని నా ఈ జీవన గమనాన్ని
చీకటైన ఎదురు చూపుల్ని...మూగబొయిన కూనిరాగాల్ని
సడి సేయని కాలి మువ్వని ... అర విరియని చిరునవ్వుని
పగిలిన అద్దాన్ని ...తెగిన గాలి పటాన్ని
వికసించని మొగ్గని ... గాయపడిన హృదయాన్ని
సుడి గాలిని... పెను తుఫాను ని
హొరెత్తిన సంద్రాన్ని ... తెగబడె కెరటాన్ని...

ఎన్ని వర్ణనలు చేసానో
ఎన్ని చిత్రాలు గీసానో
ఎన్ని పాటలల్లానో
ఎన్ని అక్షరసుమాలల్లానో
ఎన్ని క్షణాల్ని పరవశింపజేసానో
ఎన్ని స్వప్నాలు మోసానో
ఎన్ని స్వర్గాలు తిలకించానో
ఎంట వెన్నెలని ఇలకు దించానో
ఎన్ని త్యాగాలు చెసానో
ప్రియతమా నీ కోసం.............






కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి
కనుమరుగయ్యే నీ రూపాన్ని కనుపాపకి చూపించాలని..



అందరికి స్నేహితులు ఉంటారు
కాని అన్నింటికి కంటే ఎక్కవగా.అందరికి అన్నా ఎక్కవగా
నాకు నువ్వు ఉన్నావు

ఇట్లు..

మీ ప్రదీప్......

No comments: