Monday, October 8, 2007

గుండె మండే అగ్ని గుండం....

గుండె మండే అగ్నికణం
రగులుతోంది మదిలోన
చల్లారే దారి తెలీక
రగులుతోంది లోలోనా
బయట పడే రోజు కోసం
ప్రతి క్షణం ఈ ఎదురు చూపు

సాయంత్రమా నీ చల్లదనము
రవ్వంతగా నా మనసుకివ్వమ్మా
నేనోర్వలేను ఏ మంటల్ని
కన్నీళ్ళు కూడా కరువాయెనే

అర్ధ రహిత జీవితం
ఆత్మశాంతి పూజ్యము
నీ దరి కానరాక
దారులన్ని మూసిపొయనే

కలతన్నది చిరునామాగా
కలకాలము మిగిలుండునా
నేనోర్వలేను నేనోర్వజాలను
ఇక ఏ మత్రము నా వల్లనూ..

ఇట్లు..

మీ ప్రదీప్.....

No comments: