Monday, October 8, 2007

తలుపు తెరిస్తే చలి.....

తలుపు తెరిస్తే చలి

కాసేపు మూయనా

బయట చందమామ ఒక్కడే

ఇంట్లో నేనొక్కడినే

మనీ ప్లాంట్ తో మల్లెచెట్టుకు

ఏం తగువొచ్చిందో..

ఆంటెనాతో కమిటయ్యింది

ఇక జీవితమంతా

ఒక మల్లెచెట్టు..

ఒక మనీప్లాంటు..

ఒక నేను

ఊప్స్.. ఎవరం ఎవరితో మాట్లాడుకోం

చందమామా రా..

నా వెచటి దుప్పట్లోకి

ఆమె ఇక్కడ లేదులే..





ఇట్లు..

మీ ప్రదీప్......

No comments: