Thursday, October 11, 2007

ఓ సఖీ..!

నీవు తారసపడిన క్షణం నా మదిలోని
భావ వారశిలో రేగెనొక భావ కెరటం
అది, చిత్రాలు చిత్రించరాని నా చేతి కుంచె
వెంబడి నీ చిత్రముగా ఒదగబోయింది
కానీ..! నే రవివర్మను కాను

అది, కవితలల్లటమురాని నా చేతి కలములో
సుధా విప్రుషమై నీ వర్ణనలు కాబోయింది
కానీ..! నే శ్రీనాథుడను కాను

అది, ప్రతిమలు చెక్కటం రాని నా చేతి ఉలి
వెంట నీ ప్రతిమగా రూపొందబోయింది
కానీ..! నే అమరశిల్పి జక్కనను కాను

ఇవ్విదమున ఎన్నెన్నో
నిను సంతరించుకోలేని చిత్రాలు.. ఎన్నెన్నో

ఎమి చెయ్యను !? నిన్ను చూచుకొను
సజీవ రూపం చిత్రించుకొనలేని అసమర్థుడను

కానీ..! నాకొకటి కలదుగా.. అవకాశము
అదే..! స్వప్న జగత్తు..!
నీవు దక్కవన్న నిజాన్ని మరచిపోతూ...
స్వప్న జగత్తులో నా హృది పీఠంపై
నిన్ను ప్రతిష్తించుకుని ఆరాదించే నన్ను,
ఓ సఖీ..! మేల్కొల్పకుమా..! స్వప్నం చెరపకుమా..!

No comments: