Monday, October 8, 2007

చిరునవ్వుల వీడ్కోలు.......

ఎన్నొ స్నేహాలు మరెన్నొ పరిచయాలు
ప్రతిక్షణం పలుకరించె తియ్యని స్వరాలు
ఎప్పటికి మనసులొ మిగిలిపోయె మధురిమలు

ఒకసారి కుసలం అడిగిన మరొ సారి మందలించిన
ఒకసారి ఓదార్చిన మరొ సారి కష్టపెట్టిన
ఒకసారి నవ్వించిన మరొ సారి బాధించిన

నిన్నటి రోజులు ఉండవు ఆ ఙాపకాలు లెకుండ
నేటి రోజు గడవదు ఆ అనుభవాలు ప్రోధిచెయ్యక
రేపటి రోజులని ఉహించగలమ ఆ క్షణాలు రాకుండ

అందుకె ప్రతి క్షణాన్ని సాదరంగ ఆహ్వనిస్తున్నాను
ప్రతి పరిచయానికి ఒక నమోవాకం సమర్పించుకుంటున్నాను
ఎప్పుడు నాదైన నాకున్న నేస్తం తో మరి కొన్ని క్షణాల కోసం
చివరిగ తొట్ట తొలిగ చిరునవ్వుల వీడ్కోలు.......



....ఇట్లు.....
శ్రీ

No comments: