చిరునవ్వు సింగారించుకొని
కనులతో ఊసులాడుతూ
నేను కవినని నాకు గుర్తుచేసి
ఏదో ఒకటి రాయమని
ఉత్సాహం నింపి కలం చేతికిచ్చి
చటుక్కున మయమయ్యింది...
ఎవరది నన్ను నిద్ర లేపింది?
అరే ఎవరది నాకల చిదిమేసింది?
ఏమి రాయను మరి ఇప్పుడు నేను?
కలలో ఉండి నిజాన్ని మరువనా?
నిజానికి వచ్చి కలను ఙ్నాపకంగా దాచుకోనా?
ఇట్లు..
మీ ప్రదీప్......
Monday, October 8, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment