" అక్షర కుసుమాలను కూర్చి
మనసు మాటను
మాలగ మలచిన కవిని నేను
అగ్గి రవ్వలను చేర్చి
ఆవేశపు జడివానను
జ్వాలగ మార్చిన విప్లవాన్ని నేను
జన చైతన్యాన్ని మేలుకొల్పి
వాహినిగ మార్చి
మార్గం చూపిన ఆలోచనను నేను
నిరాశను పారదోలగ
నేను వున్నానంటు
దైర్యం చెప్పిన ఆశను నేను
రాజకీయ సరిగమలను
రసరమ్య గీతికగ మలచి
పాలన అందించనున్న రాజకేయుడను నేనే"
ఇట్లు..
మీ ప్రదీప్......
Monday, October 8, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment